ఆర్మూర్, అక్టోబర్ 29 : ఆర్మూర్ ప్రాంతం ఎర్రజొన్న పం ట సాగుకు ప్రత్యేకమైనది. ఆర్మూర్ ప్రాంతంతో పాటు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో సాగయ్యే ఎర్రజొన్న పంట దేశంలోని ఉత్తరాది రాష్ర్టాలకు ఎగుమతి అవుతుంది. 20, 30 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతంలో రైతులు ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారు. ఆర్మూర్‌కు చెందిన విత్తన వ్యాపారులు రైతులకు విత్తనాలు అందజేసి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి ఢిల్లీ ఉత్తరాది రాష్ర్టాల వ్యాపారులకు ఎగుమతి చేయడం పరిపాటిగా వస్తున్నది. కాగా 2008 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ రామాంజనేయులు, మండలంలోని అంకాపూర్‌కు చెందిన ఎర్రజొన్న విత్తన వ్యాపారి కూనింటి మహిపాల్‌రెడ్డితో ఒప్పందం చేయించారు. ప్రతి రైతూ ఎర్రజొన్న విత్తన వ్యాపారి అయిన కూనింటి మహిపాల్కే ఎర్రజొన్నలను అమ్మేలా ఒప్పందం చేయించారు. కానీ విత్తన వ్యా పారి మహిపాల్‌రెడ్డి రైతులకు పంట డబ్బులను చెల్లించకపోవడంతో అప్పట్లో రోడ్డెక్కారు. 2008 సంవత్సరంలో ఎర్రజొన్నల బకాయిల కోసం రోడ్డెక్కిన రైతులనుద్దేశించి మాట్లాడేందుకు ఉద్యమ నేత, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆర్మూర్‌కు వచ్చారు. అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఎదుట రైతు జేఏసీ నాయకులతో కలిసి అప్పటి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి దీక్షలో కూర్చుని జాయింట్ కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతిపత్రాలను అందజేశారు. రాష్ట్రం సాధించుకున్న అనంతరం 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎర్రజొన్న బకాయిలు ఇచ్చేందుకు ఆర్మూర్ ఎ మ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ప్రస్తుత మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం సీఎం కేసీఆర్‌తో పలుమార్లు చర్చించి ఎర్రజొన్న బకాయిల అంశాన్ని కొలిక్కి తెచ్చారు. 2015 వ సంవత్సరంలో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్ ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి మండలంలోని దేగాం గ్రామంలో రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించలేకపోయిన రూ.11 కోట్ల పైచిలుకు ఎర్రజొన్న బకాయిలను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది.
రైతులకు న్యాయం చేసిండు..
2008 సంవత్సరంలో రైతులకు విత్తన వ్యాపారి చెల్లించకపోయినా ఎర్రజొన్న బకాయిల విషయాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. కానీ అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2015 వ సంవత్సరంలో మండలంలోని దేగాం గ్రామంలో ఎర్రజొన్న రైతులకు బకాయిల చెక్కులను పంపిణీ చేశారు.
-ఇట్టెడి రజితారెడ్డి, మహిళా రైతు, కోటార్మూర్
ఇచ్చిన మాటకు కట్టుబడి..
ఎర్రజొన్న రైతుల బకాయిల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఉద్యమనేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ 2008లో ఆర్మూర్‌కు వచ్చిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ బకాయిలను ఇప్పించారు.
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆర్మూర్