e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం

తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం

  • జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు
  • నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 45 మందిపై కేసులు నమోదు
  • రూ. రెండు లక్షల విలువైన గుట్కా పట్టివేత

ఇందూరు, అక్టోబర్‌ 23 : నిషేధిత తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కిరాణాదుకాణాలు, పాన్‌షాపులపై దాడుల చేశారు. మొత్తం 45 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలో ఒకటో టౌన్‌, నాల్గో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుట్కా విక్రయిస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వోలు ఆంజనేయులు, సందీప్‌ తెలిపారు. రెండో టౌన్‌ పరిధిలో రూ.10వేల విలువైన గుట్కాను సీజ్‌ చేసి ఏడు కేసులు నమోదుచేశామని ఎస్‌హెచ్‌వో సాయినాథ్‌ తెలిపారు. ఆరోటౌన్‌ పరిధిలోని ఓ ఇంట్లో రూ.20వేల నుంచి రూ.30వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నామని, రెండు కేసులు నమోదుచేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఐదోటౌన్‌ పరిధిలో ఓ వ్యాపారి వద్ద రూ.లక్ష విలువైన గుట్కా పట్టుబడిందని ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. ఖిల్లారోడ్డు, ఆహ్మదీపుర, అహ్మదీబజార్‌, బడాబజార్‌ ప్రాంతాల్లోని పాన్‌షాపులు, కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి రూ.10వేల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నామని, ఏడుగురిపై కేసులు నమోదు చేశామని రెండోటౌన్‌ ఎస్సై సాయినాథ్‌ తెలిపారు. రూ. రెండు లక్షల విలువైన గుట్కాను సీజ్‌ చేశామని, నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 45 కేసులతోపాటు 8 పిటీకేసులు నమోదైనట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోలీసుల తనిఖీలు

- Advertisement -

ధర్పల్లి, అక్టోబర్‌ 23 : మాదకద్రవ్యాలు విక్రయించే, వాటిని తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీశైలం హెచ్చరించారు. మండల కేంద్రంలోని కిరాణాదుకాణాలు, పాన్‌షాపులు, హోటళ్లలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. నిషేధిత తంబాకు ఉత్పత్తులు, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు ఎవరైనా సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. తనిఖీల్లో ఎస్సై మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

రుద్రూర్‌లో..

రుద్రూర్‌, అక్టోబర్‌ 23 : మండల కేంద్రంలోని దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంగడిబజార్‌లోని వహీద్‌ అనే వ్యాపారికి చెందిన దుకాణంలో నిషేధిత గుట్కా, తంబాకు ఉత్పత్తులను గుర్తించి సీజ్‌ చేశారు.

పోచంపాడ్‌లో..

మెండోరా, అక్టోబర్‌ 23 : మండలంలోని పోచంపాడ్‌లో ఉన్న పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలోని దుకాణాల్లో గుట్కా అమ్మకాలు, కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్సై వెంట పోలీస్‌సిబ్బంది మోహన్‌రెడ్డి, తదితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement