కామారెడ్డి, అక్టోబర్ 31 : జిల్లాకేంద్రంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన సూరజ్ కుమార్, కరీంనగర్‌కు చెందిన ధనూ, పశ్చిమబెంగాల్‌కు చెందిన బిషర్ నామియా జిల్లాకేంద్రంలోని డైలీ మార్కెట్లో ఆదివారం సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతుండగా.. ముగ్గురు దొంగలను స్థానికులు పట్టుకొని చితకబాదారు. వారు ఆరు ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంతలు, మార్కెట్లలో చోరీలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.