బీర్కూర్/ పిట్లం/ ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 31: బీర్కూర్ మండలకేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వల్లభ్‌భాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వసంత్ రెడ్డి, ఉపాధ్యాయులు జ్యోతి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలకేంద్రంలో సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మంచి శశిధర్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పిట్లం ఉపసర్పంచ్ ఇబ్రహీం, మాజీ వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షులు వేణుమాధవ్‌రెడ్డి, సత్యం, పోచయ్య, అంబదాస్, కాంగ్రెస్ నాయకులు బొడ్ల రాజు, బీజేపీ నాయకులు రాము, అశోక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వల్లభ్ భాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సతీశ్, ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, బాల్‌రాజ్, గణేశ్, వంగపల్లి కాశీనాథ్, ప్రశాంత్, లక్ష్మీనారాయణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.