పిట్లం/ నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట/ మాచారెడ్డి, అక్టోబర్ 31 : జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు ఆదివారం ప్రారంభించారు. పిట్లం మండలం తిమ్మానగర్ సహకార సంఘం పరిధిలోని మార్ధండ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్, విండో చైర్మన్ సాయిరెడ్డి ప్రారంభించారు. కారేగాం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, బండపల్లి, మద్దెలచెరువు గ్రామాల్లో పిట్లం-చిల్లర్గి విండో చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, కారేగాం సర్పంచ్ దుర్గయ్య, వైస్ చైర్మన్ పుట్టి రాములు, టీఆర్ఎస్ నాయకులు విజయ్, లచ్చిరెడ్డి, వెంకట్‌రెడ్డి, అశోక్, నారాయణ, జైపాల్‌రెడ్డి, గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు, కార్యదర్శులు అశోక్‌గౌడ్, సంతోష్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలం మల్లూర్ సొసైటీ పరిధిలోని జక్కాపూర్, మల్లూర్ తండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్పర్సన్ కళ్యాణి విఠల్‌రెడ్డి ప్రారంభించారు. గున్కుల్ సొసైటీ పరిధిలోని నర్వ, బుర్గుల్, కోమలంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచులు కంసవ్వ, శాంతి, సవేరాబేగం, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలపరిధిలోని కళ్యాణి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు ప్రారంభించారు. రైతులు ఆరబెట్టిన తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సొసైటీ సీఈవో విశ్వనాథం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రఘువీర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీధర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు మర్రి ప్రకాశ్, నారాయణ పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో ఐసీడీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పుట్టి పోశయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్పర్సన్ సుకన్య, ఎంపీటీసీ సభ్యురాలు సామ్‌ని, టీఎస్సీసీ డైరెక్టర్ పర్వయ్య, ఉప సర్పంచ్ రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పూల్చంద్నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మాగౌడ్, డైరెక్టర్లు బుచ్చిరెడ్డి, సీఈవో చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.