పిట్లం/లింగంపేట/బిచ్కుంద/బాన్సువాడ /నాగిరెడ్డి పేట్, నవంబర్ 2 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, విండో పాలకవర్గ సభ్యులు అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదాత పండించిన ప్రతి గింజనూ కొనుగోలుచేసి మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిట్లం మండలంలోని పిట్లం-చిల్లర్గి సహకార సంఘం ఆధ్వర్యంలో బొల్లక్‌పల్లి, సిద్ధాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా, విండో చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. పారడ్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని చిన్నకొడప్గల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు పట్లోళ్ల సావిత్రీరవీందర్, సక్రూసింగ్, విండో వైస్‌చైర్మన్ పుట్టి రాములు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాబూసింగ్, నవీన్, శ్రీహరి, కార్యదర్శులు సంతోష్‌రెడ్డి, హన్మాండ్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
లింగంపేట మండలం ఎక్కపల్లి, ఎక్కపల్లి తండా, ముస్తాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు సతీశ్‌గౌడ్, బన్ని సక్రూ, మాలకమ్మరి మమత ప్రారంభించారు. ఎంపీటీసీ సామ్నీ, ఏఎంసీ వైస్ చైర్మన్ నరహరి పాల్గొన్నారు.
బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ అశోక్ పటేల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీరాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, స్థానిక సర్పంచ్ మారుతి, ఐకేపీ సీసీ రాజు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో సొసైటీ పరిధిలోని నాగారం, కొల్లూర్, పాత బాన్సువాడ సొసైటీ ఆవరణలో, బాన్సువాడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరిధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు సూచించారు.
ఆర బెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలి
ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. గ్రేడ్-ఏ ధాన్యానికి రూ. 1960, గ్రేడ్-బీ రకానికి రూ. 1940 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.