Kamal Rashid Khan | బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2020లో చేసిన వివాదాస్పద ట్వీట్‌పై కేసు నమోదైంది. ఈ క్రమంలో కేఆర్కేను ముంబై మిమానాశ్రయంలో మలాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ బోరివలి కోర్టులో కమల్ ఖాన్‌ను హాజరుపరుచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే రషీద్ ఖాన్.. ప్రముఖ బాలీవుడ్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. కేఆర్కే పాన్ ఇండియా తెలుగు చిత్రాలపై సైతం తన అక్కసును వెళ్లగక్కాడు.