హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్‌రావుతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. న్యాయ విచారణలో భాగంగా రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన మేడిగడ్డతోపాటు ఇతర బరాజ్‌లు, ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు.
బీఆర్కే భవన్లో ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవల జారీ చేసిన మధ్యంతర సిఫారసులపై కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ఆ దిశగా పనులు చేపట్టాలని కూడా ఆదేశించినట్టు సమాచారం.