చేవెళ్ల రూరల్, జూన్ 18 : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం శంకర్‌పల్లిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడం, హోం కంపోస్టింగ్‌పై చ్రితలేఖనం, రంగోళి, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై మాట్లాడారు. వంద రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై శుభ్రత, పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు శుభ్రత, స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోటీల్లో వంద మంది విద్యార్థులు పాల్గొనగా.. ప్రతిభ కనబర్చిన 15 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే యాదయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్షీ ప్రవీణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మేనేజర్ వీ అంజన్ కుమార్, ఇంజినీర్ బీ ఆనంద్, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.