కోదాడ, జూలై 23 : సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే లక్ష్యంగా కాకతీయ సేవా సమితి పని చేస్తుందని సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం దుర్గాపురం వై జంక్షన్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే వీరేపల్లి లక్ష్మీనారాయణరావు సౌజన్యంతో ఆయన సతీమణి సత్యవతి మూడవ వర్ధంతి సందర్భంగా 10 మంది విద్యార్థులకు లక్ష రూపాయల స్కాలర్ షిప్ లను అందజేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి స్వార్థం లేకుండా కాకతీయ సేవా సమితి సభ్యులు విద్యార్థులకు, పేదలకు తాము ఉన్నామంటూ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. అంతేకాకుండా కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయం కూడా పేదలకు ఖర్చు చేస్తామని ప్రకటించడం వారి ఔదార్యానికి, సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పెదనాటి వెంకటేశ్వరరావు, సెక్రటరీ వేమూరి సురేశ్, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్, నాయకులు మహబూబ్ జానీ, గన్న చంద్రశేఖర్, ముత్యాలు, ఓరుగంటి ప్రభాకర్, చింతల పార్టీశ్రీనివాస్, భరత రెడ్డి, వీరారెడ్డి, రావెళ్ల సీతారామయ్య, పోటు రంగారావు, బాలకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, గంట సత్యనారాయణ, కనగాల నాగేశ్వరరావు, పైడిమర్రి సత్తిబాబు పాల్గొన్నారు.