IND vs ZIM | టాస్ గెలిచిన భారత్.. టీ20ల్లో యువ పేసర్ అరంగేట్రం..!
IND vs ZIM : హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. సారథిగా ఒక్క విజయమూ సాధించని అయ్యర్.. ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకోనున్నాడు.
IND vs ZIM : ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు (Team India) ఈసారి జింబాబ్వే (Zimbabwe)ను ఢీకొడుతోంది. వరసగా రెండు సిరీస్‌లు, టీ20 ర్యాంకింగ్స్ కోల్పోయిన టీమిండియా.. క్లీన్‌స్లీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. సారథిగా ఒక్క విజయమూ సాధించని అయ్యర్.. ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకోనున్నాడు.
మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గురువారం భారత్, జింబాబ్వే తలపడుతున్నాయి. ఈ గేమ్‌తో భారత పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించాలనే కసితో ఉన్నాడు. అలానే.. లోయర్ ఆర్డర్, పేస్ దళం కూడా ఆఫ్రికా బ్యాటర్లను హడలెత్తించి పరువు కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నారు.
🚨 Toss and Team Update 🚨#TeamIndia elect to bowl in the 1st T20I against Zimbabwe
A look at our Playing XI 💪
Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#ZIMvIND pic.twitter.com/w5wD1vCpV8
— BCCI (@BCCI) July 23, 2026
జింబాబ్వే తుది జట్టు : బ్రియన్ బెన్నెట్, తడివనషె మరుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మయెర్స్, సికిందర్ రజా(కెప్టెన్), రియాన్ బురి, వెస్లీ మధీవరె, బ్రాడ్ ఎవాన్స్, న్యూమన్ న్యహుమ్రి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబని.
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
A special moment ahead of the series opener in Harare!
Congratulations to Ashok Sharma, who is all set to make his #TeamIndia Debut 👏👏
Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#ZIMvIND pic.twitter.com/veS4gEKdom
— BCCI (@BCCI) July 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

