Software Employee | వాళ్లందరినీ టర్మినేట్ చేసే దాకా వదలను.. జాబ్ కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భావన
Software Employee | అనారోగ్య సమస్యల కారణంగా మూడు రోజులు సెలవు తీసుకుంటే యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని టెక్ మహీంద్ర (Tech Mahindra)లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన అనే ఉద్యోగిని ఫిర్యాదులో పేర్కొంది.
Software Employee | కుత్బుల్లాపూర్: టెక్ మహీంద్ర (Tech Mahindra)లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన అనే ఉద్యోగిని తనను అకారణంగా కంపెనీ విధుల నుంచి తొలగించారని గురువారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించిందని తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా మూడు రోజులు సెలవు తీసుకుంటే యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా భావన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇటీవలే జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఉద్యోగాలకు వందలాది మంది వస్తే ఇంటర్వ్యూలో పాసై ఉద్యోగంలో చేరాను. జూన్ నెలలో నాకు ఆరోగ్యం బాగా లేదు. ఫ్లోర్ మీదనే పడిపోయా. వాళ్లు ఇక్కడి నుంచి యూనివర్సిటీలో ఉన్న చిన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి తన కండిషన్ బాగా లేదు.. మల్లారెడ్డికి తీసుకెళ్లండి అని చెప్పారు. అక్కడినుంచి నేను మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ కూడా సౌకర్యాలు సరిగా లేవని మా ఆయన నన్ను ఇంటి దగ్గరున్న ఆస్పత్రికి మార్చారు.
మీరు చాలా రోజుల నుంచి కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్నారు. కాబట్టి మీకు స్పాండిలైటిస్ అయ్యి ఉండొచ్చు. దానికి ట్రీట్ మెంట్ తీసుకోండి అని చెప్పారు. స్పాండిలైటిస్ ట్రీట్ మెంట్ తీసుకునేందుకు 15 రోజులు ఫిజియో థెరపీ ఉంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వారికి సమర్పించాను. ఆ తర్వాత ఆ 14 రోజుల టైంలో నాకు బెదిరింపు ఈ మెయిల్స్ వస్తున్నాయి. మీరు రిపోర్ట్ చేయట్లేదు.. చాలా సార్లు కాల్ చేశారు.. మీరెప్పుడొస్తున్నారు.. అని అడిగారు కానీ మీకెలా ఉంది.. మీ ఆరోగ్యానికి ఏమైంది.. అని ఎవరూ కూడా అడగలేదంటూ భావన ఆవేదన వ్యక్తం చేసింది.
శుక్రవారం మా పాపకు బాగా లేదని కాల్ చేసి చెప్పాను. శనివారం పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాను. అందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా కూడా వాళ్లు నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు. వాళ్లకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు.. కాబట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని మెయిల్ పెట్టారు. నేనెక్కడా వాళ్లకు కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో.. నాకైతే తెలియలేదు. 22న ఆఫీస్‌కు రమ్మన్నారు. వచ్చాక నేను ఇలాంటి భయానక వాతావరణంలో పనిచేయలేనని అనిపించింది. ఏదైనా సరే అని పీఎస్‌కు వెళ్లాను. పిటిషన్ తీసుకుని రషీదు ఇచ్చారు. సడెన్‌గా ఉద్యోగంలో నుంచి తీసేస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి..? ఎవరైతే నన్ను జాబ్ లో నుంచి తీసేశారో..ఎవరైతే నాకు ఈ మెయిల్ చేశారో.. వాళ్లందరినీ టర్మినేట్ చేసేదాకా నేను వదలను.. ఇక్కడే కూర్చుంటా అని భావన చెప్పింది.
మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన
తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు… https://t.co/9iimUJ6vu4 pic.twitter.com/J6pHXZQlew
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
Read Also :
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

