Rono Mukherjee | బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన కాజోల్, రాణీ ముఖర్జీ ఇంట తీరని విషాదం చోటు చేసుకుంది. వారి చిన్నాన్న ప్రముఖ దర్శకుడు రోనో ముఖర్జీ(83) వయస్సు సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. ఆయన నటి శర్బానీ ముఖర్జీకి తండ్రి కాగా, కాజోల్, రాణీ ముఖర్జీ, అయాన్ ముఖర్జీ, తునిషా ముఖర్జీలకు చిన్నాన్న వరుస. ఆయన మృతితో వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శర్బానీతో పాటు ప్రముఖులు రోనో ముఖర్జీకి నివాళులర్పించారు.
రోనో ముఖర్జీ మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక తన సినిమా ‘ది మామ్’ ప్రమోషన్లో బిజీగా ఉండటంతో కాజోల్ అంత్యక్రియలకు రాలేకపోయారు. రోనో ముఖర్జీ మృతికి గల కారణం ఇంకా తెలియరాలేదు, వయోభారం కారణమై ఉండొచ్చని అంటున్నారు. నటుడు, దర్శకుడు, అయాన్ ముఖర్జీ బావ అయిన ఆశుతోష్ గోవారికర్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘హవాన్’ (1977), ‘తూ హీ మేరీ జిందగీ’ (1965) సినిమాలతో రోనో ముఖర్జీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ముఖర్జీ ఇంట ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 14న అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూసారు. ఆ దుఃఖం నుంచి ఇంకా తేరుకోకముందే రోనో ముఖర్జీ మరణించడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రోనో ముఖర్జీ వారి సోదరులలో పెద్దవాడు. అలానే ఆయన బాంబే దుర్గా పూజ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ఇక కాజోల్ మరియు రాణి ముఖర్జీ ఇద్దరూ బాలీవుడ్ నటీమణులు. కాజోల్, రాణి ముఖర్జీ ఒకరికొకరు వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు. 1998లో విడుదలైన “కుచ్ కుచ్ హోతా హై” సినిమాతో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే, చాలా కాలం పాటు వీరిద్దరు దూరంగా ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడలేదని వార్తలు వచ్చాయి. రాణి ముఖర్జీ తన కజిన్ కాజోల్‌తో కలహానికి కారణం తమ మధ్య అవగాహన లోపమే అని అన్నారు. రాణి ముఖర్జీ తను గర్భవతి అని తెలుసుకున్న తర్వాత కాజోల్‌తో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది, అని తనీషా ముఖర్జీ ఓ సందర్భంలో తెలిపారు