Helicopter Crashes | రష్యా (Russia)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది (Helicopter Crashes). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
దక్షిణ రష్యాలోని డాగేస్తాన్ (Dagestan) ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్లిజ్యార్ నుంచి ఇజ్జెర్బాష్కు వెళ్తున్నKa-226 హెలికాప్టర్ (Ka-226 helicopter) తోకభాగం విరిగిపోయింది. దీంతో పైలట్ దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ అదుపుతప్పి కాస్పియన్ సముద్ర తీరానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌పై కూలిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం లేదా పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
❗️The moment of yesterday’s Ka-226 helicopter crash in 🇷🇺Dagestan with employees of the military plant “Kizlyar Electromechanical Plant”
The accident killed the deputy general director, chief engineer and chief designer pic.twitter.com/JVVKEWc43E
— 🪖MilitaryNewsUA🇺🇦 (@front_ukrainian) November 8, 2025
Also Read..
Rahul Gandhi | ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే SIR : రాహుల్ గాంధీ
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Madhya Pradesh | మంచినీళ్ల కోసం వెళ్లిన బాలిక సామూహిక లైంగికదాడి.. నిందితుల్లో మైనర్