హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్‌గాంధీ జోకర్ పాత్ర పోషిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని రాహుల్ ఓర్వలేక చవకబారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాహుల్ కౌగిలింతలు, ఆలింగనాలు చూసి జనాలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో చర్చలు జరుపకుండా వీధినాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.