రాహుల్‌కు సింధియా ప్రశ్న
న్యూఢిల్లీ, మార్చి 9: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లోనే కొనసాగిఉంటే ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సింధియా స్పందించారు. ‘నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నా గురించి ఆలోచించని, ఆందోళన చెందని రాహుల్ ఇప్పుడు దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు’ అని ప్రశ్నించారు.