హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టుకున్నా రు. మంత్రి సీతక్క సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సీతక్క మాట్లాడు తూ.. ‘మీ సతీమణి చనిపోయినప్పు డూ మేము బాధపడ్డాం.. మీకు రాఖీ కడితే సోదరి అంటూ ఆప్యాయంగా సంబోధిస్తారు. లేని అమ్మను.. అన డం ఏంది..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో స్పీకర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
సభకు అవమానం : సీఎం రేవంత్
సభాపతితో పాటు వారి కుటుంబసభ్యులను అవమానించేలా మాట్లాడిన ఈ రోజు నాలుగు కోట్ల ప్రజలకు అవమానం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘స్పీకర్‌కు జరిగిన అవమానం సభకు జరిగినట్టే. ఇలాంటి భాష వాడిన ఎమ్మెల్సీని డిస్మిస్ చేయాలి’ అని కోరారు.
కేసీఆర్ స్పందించాలి: శ్రీధర్‌బాబు
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘టీషర్టుపై నినాదాలు ఉంటే అసెంబ్లీకి అనుమతించకూడదని నిబంధన ఉంది. తాతామధు వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు’ అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో బీర్ల ఐలయ్య చావు భాష
సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే కాం గ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చావు భాష మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దళిత స్పీకర్‌ను అవమానించినందుకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించి చావు డప్పు కొట్టాలని పిలుపునిచ్చారు. బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సీఎం డైరెక్షన్.. ఎమ్మెల్యేల యాక్షన్
అసెంబ్లీలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఎమ్మెల్యేలు చదివి వినిపించడం కనిపించింది. ఎ మ్మెల్యేలు మాట్లాడుతున్న సందర్భంలో రేవంత్‌రెడ్డి కాగితాలపై రాసిచ్చిన అంశాలను బీర్ల ఐలయ్య పలువురు ఎమ్మెల్యేలకు అందజేశారు.