మారుతి కార్లు మరింత ప్రియం
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మే నెల నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్లనే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
- బ్యాడ్ న్యూస్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మే నెల నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్లనే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
గత రెండు సార్లుగా అన్ని మాడళ్ల ధరలను సవరించిన సంస్థ..ఈసారి మాత్రం ఎంపిక చేసిన మాడళ్లకు మాత్రమే వర్తించనున్నదని వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ధరల పెంపు అనివార్యమైందని పేర్కొంది. అయితే, ద్రవ్యోల్బణ భారాలు అధికంగా ఉండటం, ప్రతికూల వ్యయాలు కొనసాగుతుండటంతో వినియోగదారులపై స్వల్ప భారం మోపినట్టు వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

