Justice Madhavi Devi | హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): హైకోర్టు చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి 12 గంటలపాటు కేసుల విచారణ జరిపి రికార్డులకెకారు. శుక్రవారం ఉద యం 10.30 గంటల నుంచి రాత్రి వరకు ఆమె కేసులను విచారించారు. వేసవి వెకేషన్ బెంచ్‌లో ఆమె ఈ కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఉదయం పదిన్నర గంట ల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఏకసభ్య ధర్మాసనంలో కేసులు విచారించారు. మధ్యాహ్నం 2.15 గం టల నుంచి 5 గంటలు దాటే వరకు ద్వి సభ్య ధర్మాసనంలో 20 కేసుల విచారణ జరిపారు.
ఆ తర్వాత తిరిగి ఏకసభ్య ధ ర్మాసనంలో కేసుల విచారణ చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకూ సింగిల్బెంచ్లో 74 కేసులు విచారించారు. రెగ్యులర్ కోర్టులో కేసుల విచారణ తరహా లో ఇరుపక్షాల వాదనలు ఆమె ఓపిగ్గా వినడం గమనార్హం. భోజన విరామం తర్వాత కేసుల విచారణ ఏకబిగిన జరిపారు. బెంచ్‌లో ఉన్న కోర్టు అధికారులు మారుతూ వచ్చినప్పటికీ ఆమె కేసుల విచారణ పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశారు. మరికొన్నింటిలో నోటీసులు, ఇంకొన్ని కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.