జోగులాంబ గద్వాల : కాటన్ సీడ్ (cotton seed farmers ) ప్యాకెట్ ధర విషయంలో కంపెనీలు, ఆర్గనైజర్లు గందరగోళం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ( BRS ) గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు( Hanmanth Naidu) ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపూరిత కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
గద్వాల జిల్లాలో పత్తి సాగు కోసం సిద్ధమైన రైతులకు ప్యాకెట్‌కు రూ. 50లు తగ్గిస్తామని కంపెనీలు, ఆర్గనైజర్ చెప్తున్నారని ఇలా చేస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. అన్ని కంపెనీలు సమానంగా జీఎంఎస్ వెరైటీకి రూ. 500 ,కన్వెన్షన్ వెరైటీకి రూ. 600 ప్యాకెట్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాటన్ సీడ్ ప్యాకెట్ ధర విషయంలో కంపెనీలు ప్రతిసారి ఇలా ప్రవర్తించటం సరికాదన్నారు.
నడిగడ్డలో రైతులుపెద్ద ఎత్తున కాటన్ సీడ్ పండిస్తుంటే వారికి మంచి ధర కల్పించాలని డిమాండ్ చేశఆరు. నిన్న కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గ పరిధిలోని ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యం తడిసి ముద్దాయిందని, వెంటనే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చక్రిదర్ రావు, మోనేష్, డి శేఖర్ నాయుడు, బీచుపల్లి, వెంకటేష్ నాయుడు, గంజిపేట రాజు, కొళాయి భాస్కర్, నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.