ముంబై: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణను ఎంపిక చేసుకుంది. 2020, 2022 అండర్-19 ప్రపంచకప్‌లలో లంక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 19 ఏండ్ల మతీశ.. విలక్షణ బౌలింగ్ యాక్షన్‌తో జూనియర్ మలింగగా గుర్తింపు సాధించాడు. కనీస ధర రూ. 20 లక్షలకు పతిరణను చెన్నై జట్టు సొంతం చేసుకుందని గురువారం ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక 2020 అండర్-19 ప్రపంచకప్‌లో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరిన పతిరణ.. క్రీడాలోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే.