Wedding | జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 20 : ఉద్యోగం నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డ ఇక్కడి అమ్మాయి శాంతి సఫల.. అమెరికా అబ్బాయి మెక్ గ్రాత్ నికోలస్ ట్రాయ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్‌కు చెందిన శానం జోజప్ప, సుమలత దంపతుల కుమార్తె శాంతి సఫల టెక్సాస్‌లో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేసే క్రమంలో ఆమెకు మెక్ గ్రాత్ డెన్నిస్ విలియం, ఫెర్లాన్ చెరిల్ల కుమారుడు నికోలస్ ట్రాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలిశాయి.
శాంతి సఫల- నికోలస్ ట్రాయ్ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ జంట బుధవారం రాత్రి నగరంలోని వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడి అమ్మాయి రిసెప్షన్ కు రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తమ ప్రాంతానికి చెందిన అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్ళి జరుగడంతో స్థానికులు పెద్ద ఎత్తున వివాహ వేడుకలకు హాజరయ్యారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!