సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ ( Bullet Train ) సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో ( Hold Hunger ) జర్నలిస్టులు సోమవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. దీక్షలకు మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య సంకినేని వెంకటేశ్వర్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ( Railway ) ను సాధించుకునేందుకు బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని అన్నారు.

దీక్షలో కూర్చున్న జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వజ్జే వీరయ్య, గుండ శ్రీనివాస్ గుప్తా, రాంబాబులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మొదటగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ జరిగినప్పటికీ దాన్ని పక్కదారి పట్టించి రాజకీయాలు చేశారని ఆరోపించారు. రైల్వే లైన్ ఉన్న వైపే మరో రైల్వే లైను వేయడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మొదట కేటాయించినట్లుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ జరగాలన్నారు.
ఈ దీక్షలో జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వాసా చంద్రశేఖర్, అయితగాని రాంబాబు, గుణగంటి సురేష్, నాయని శ్రీనివాస్ రావు, బుక్క రాంబాబు, మల్లికార్జున్, సుంకర బోయిన వెంకటయ్య, ఫణీంద్ర నారాయణ, ఊట్కూరి రవీందర్, కొడిదల రాజబాబు, కందుకూరి యాదగిరీ, దన్యాకుల వెంకటేశ్వర్లు, రవి, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వీరికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మండాది డేవిడ్ కుమార్, పోలబోయిన కిరణ్, రాపర్తి శ్రీనివాస్, నేరెళ్ల మధు, షర్టు నాగయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.