Delhi Rains | ఢిల్లీలో కుండపోత.. పలు విమాన సర్వీసులకు అంతరాయం..!
Delhi Rains : ఉత్తర భారతంలో వానలు జోరందుకున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు, ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
Delhi Rains : ఉత్తర భారతంలో వానలు జోరందుకున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమవ్వగా.. ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నగరంలో జనజీవనం స్తంభించిపోగా.. గురుగ్రామ్, ఫరిదాబాద్లకు భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఢిల్లీలో సోమవారం ఉదయం నుంచే వాన దంచుతోంది. రాజధాని సమీపంలోని ఎన్సీఆర్ ప్రాంతం, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోనూ వర్షం భారీగా పడుతోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
#WATCH | Students wade through a severely waterlogged street in the Sangam Vihar area amid heavy rainfall in Delhi today pic.twitter.com/78O5kwdYQB
— ANI (@ANI) August 24, 2026
ఇప్పటివరకూ దాదాపు 12 విమానాలను జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ నుంచి 6E 404, IX 1462, IX 1047, AI 4308, AI 2526, IX 1236, IX 136, SG 126, AI 1814, 6E 6125, 6E 2102 and AI 2381 ఫ్లైట్స్‌ను జైపూర్‌కు దారి మళ్లించినట్టు ఢిల్లీ విమానయానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వానలు దంచుతుండగా.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షం పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణలో కూడా పెద్ద వానలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
VIDEO | Rain lashes Delhi-NCR; visuals of waterlogging from Shivaji Stadium.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/tKRO69bvGR
— Press Trust of India (@PTI_News) August 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi rains
- Faridabad
- Gurugram
- IMD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

