Gellu Srinivas Yadav | నెహ్రూ ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీలనే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
Gellu Srinivas Yadav | పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే.. ఇవాళ రేవంత్ రెడ్డి అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థులందరినీ కలపడాన్ని బీఆర్ఎస్వీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు..
Gellu Srinivas Yadav | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా.. ఆనాడు మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో పారిశ్రామికీకరణ చేసేందుకు సరైన మానవ వనరులను సృష్టించడానికి ఈ దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ పాలిటెక్నిక్ కాలేజీలనే లేకుండా చేయాలనే కుట్ర చేయడం సరైన పద్దతి కాదని మేం డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు తెలంగాణ భవన్‌కు వచ్చిన సందర్భంగా మాజీ ఎంపీ వినోదకుమార్ బోయినిపల్లితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావిధానానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి జీఓ నంబర్ 94 తెచ్చి సాంకేతిక విద్యను నాశనం చేసే కుట్ర చేశారని ఆరోపించారు. ఈ దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలైన బీహెచ్ఈఎల్ కానీ, ఈసీఐఎల్ కానీ, బీడీఎల్, మిథాని లాంటి సంస్థల్లో పనిచేసేందుకు చాలా మంది పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే.. ఇవాళ రేవంత్ రెడ్డి అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే నేడు రేవంత్ రెడ్డి AICTE అనుమతి లేని, ఎలాంటి కరిక్యులమ్ లేని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థులందరినీ కలపడాన్ని బీఆర్ఎస్వీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల విలువైన భూములను పీపీపీ మాడల్‌లో నడుస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుమీద ఉచితంగా అప్పజెప్పే కుట్ర కోసమే జీఓ 97 తెచ్చారని గెల్లు ఆరోపించారు. స్కిల్ యూనివర్సిటీ చట్టం చేసి 2 సంవత్సరాలు అయినా ఎవరు అడ్మిషన్ తీసుకోవటం లేదు విద్యార్థుల అడ్మిషన్ కొరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులను జీవితాలను ఎలా తాకట్టు పెడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ నెల 26న ప్రభుత్వం తెచ్చిన జీఓ నంబర్ 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులతో సీఎంకు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని.. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ నెల 31వ తేదీలోపు అన్ని కలెక్టరేట్లలో ప్రజావాణిలో పిర్యాదు చేసి జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని నిర్ణయించటం జరిగిందన్నారు.
నాడు నెహ్రూ గారు సాంకేతిక విద్య కోసం పాలిటెక్నిక్ వ్యవస్థను తెస్తే..
నేడు రేవంత్ సర్కార్ దానిని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జీవో నం. 97 ను రద్దు చేయాలి,
లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం!– బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు… pic.twitter.com/hlXoeGBEVE
— BRS Party (@BRSparty) August 24, 2026
Read Also :
Irumudi | ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ప్రభంజనం.. 2026లో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన తెలుగు సినిమా!
Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు
Crime news | కులాంతర వివాహం వద్దన్నారని నాడు తల్లిదండ్రులను చంపింది.. నేడు తనూ ఉసురు తీసుకుంది..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

