Australia Cricket Board : ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టును వీడాడు. ప్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సన్నద్ధతపై అతడు దృష్టి పెట్టనున్నాడు. దాంతో, పాక్‌తో జరగాల్సిన ఆఖరి వన్డేకు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis)ను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 సిరీస్‌కు కూడా ఇంగ్లిస్ సారథిగా ఎంపికయ్యాడని బుధవారం ఆసీస్ బోర్డు వెల్లడించింది.
కెప్టెన్ లేకుండానే టీ20 స్క్వాడ్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా బోర్డు ఇంగ్లిస్కే పగ్గాలు అప్పగించింది. రెగ్యులర్ సారథి మిచెల్ మార్ష్, ఓపెనర్ ట్రావిస్ హెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఆసీస్ సెలెక్టర్లు టీ20 స్పెషలిస్ట్ అయిన ఇంగ్లిస్‌ను నాయకుడిగా ఎంపిక చేశారు.
Josh Inglis has been named Australia’s interim T20I captain for the upcoming series against Pakistan, in the absence of Mitchell Marsh and Travis Head, and will also lead in the third and final ODI in Perth https://t.co/DSKbUdKPni pic.twitter.com/b1AmO9jchO
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2024
‘ఆస్ట్రేలియా వన్డే, టీ20 స్క్వాడ్‌లో ఇంగ్లిస్ అంతర్బాగం. మైదానం లోపలా, బయటా అతడికి మంచి మర్యాద ఉంది. గతంలో ఆస్ట్రేలియా ఏ జట్టుకు ఇంగ్లిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు జట్టులో సానుకూల వాతావరణం తేగలడు. అంతేకాదు సీనియర్లు మాట్ షార్ట్, ఆడం జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్‌ల నుంచి అతడికి పూర్తి సహకారం లభిస్తోంది’ అని చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపాడు.
Is there anything this man can’t do ? A billionaire dollar cricketer .
Pat Cummins , the man you are ❤ pic.twitter.com/N8p6j0S2WK
— Rafi (@rafi4999) November 4, 2024
ఆస్ట్రేలియా జట్టు నవంబర్‌లో జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీమిండియాకు హ్యాట్రిక్ ట్రోఫీ అందకుండా చేయాలని ఆసీస్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. అందుకని సీనియర్ పేసర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్‌లతో పాటు బ్యాటర్లు లబూషేన్, స్టీవ్ స్మిత్‌లు పాకిస్థాన్‌తో ఆఖరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. నవంబర్ 22వ తేదీన భారత్, ఆసీస్‌ల మధ్య పెర్త్ టెస్టుతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ మొదలవ్వనుంది. ఇక.. నవంబర్ 14న గబ్బా స్టేడియంలో ఆసీస్, పాక్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది.