ఆర్కేపురం, నవంబర్ 6 : కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ లక్ష రూపాయల చెక్‌తో పాటు తులం బంగారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు. బుధవారం సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డకు ఆసరా ఉంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకోచ్చారని తెలిపారు.
6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 11నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మెసం చేసిందన్నారు. ప్రస్తుతం చేస్తున్న కుల గణణు పారదర్శంగా చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేయబోచే పాదయాత్ర నల్లగొండ నుంచి కాకుండా హైదరాబాద్‌లోని మూసీ పక్క నుండి చేయాలని అన్నారు.