న్యూఢిల్లీ, మార్చి 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 22.36 శాతం వృద్ధి నమోదైంది. దీంతో 33.81 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేశాయి. అలాగే ఇదే నెలలో భారత్ 55 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 21.19 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 2021లో నమోదైన 13.12 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటుతో పోలిస్తే భారీగా పెరిగింది.