నల్లగొండ : పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధికి ఆకర్షితులయ్యే పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. హాలియాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుర్రంపూడ్ మండలంలోని కాచారం, శాకాజిపురం, చింతగూడెం గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గౌరవం లభిస్తుందని, అందరం కలిసిట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనంజయ్య, కంచర్ల శ్రీవాణి, మాజీ సర్పంచ్ కొమ్ము రామలింగం, సీనియర్ నాయకులు తరి వెంకటయ్య, ఉప సర్పంచ్ గిరి సతీష్, బోడ సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండీ ఖాసీం, పూల సహదేవ్, తదితరులు పాల్గొన్నారు.