తొగుట : ఆపదలో ఉన్నవారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన ఎర్రోళ్ల చంద్రం, కామొల్ల నరేష్, మిద్దె మహేశ్వరి లకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా రూ.50వేల చెక్కులను సర్పంచ్ బండారు కవితతో కలిసి ఆయన అందించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, వార్డు సభ్యులు పిట్ల వెంకటేష్, జహంగీర్, నాయకులు పిట్ల వెంకటయ్య, సిరిసిల్ల లింగం, పాత్కుల బాలేష్, స్వామి, ఆంజనేయులు తదితరులున్నారు.