న్యూఢిల్లీ: జేఈఈలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్ టెన్‌లో నిలిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ 2026 పేపర్ 2 ఫలితాలు(పేపర్ 2ఏ, 2బి) మంగళవారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 7న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 67,139 మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాలను jeemain.nta.nic.inలో చూసుకోవచ్చు. కేరళకు చెందిన ఆర్ఎస్ మీరాకృష్ణ, సూర్యతేజస్ బిఆర్క్ విభాగంలో మొదటి, రెండు స్థానాలు సాధించారు.
పేపర్ 2బి(బి. ప్లానింగ్)లో తెలంగాణకు చెందిన మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి 6వ ర్యాంకు, పేపర్ 2ఏ (బి ఆర్క్)లో తెల్ల్లూరి శ్రేయస్ రెడ్డి 9వ ర్యాంకు సాధించారు. ఎస్టీ అభ్యర్థులలో బీ ఆర్క్ విభాగంలో తెలంగాణకు చెందిన శరణ్ చక్రవర్తి పృధ్విరాజ్ చౌహాన్, మాలోత్ సాయిచరణ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. బిప్లానింగ్లో ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులలో కౌశిక్ నాయక్ బోడా, పున్నూర్ రోహితారెడ్డి రెండు, మూడో స్థానాలను కైవసం చేసుకున్నారు.