జేఈఈ పేపర్ 2 ఫలితాల విడుదల
జేఈఈలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్ టెన్‌లో నిలిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ 2026 పేపర్ 2 ఫలితాలు(పేపర్ 2ఏ, 2బి) మంగళవారం విడుదలయ్యాయి.
- టాప్ టెన్‌లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు
న్యూఢిల్లీ: జేఈఈలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్ టెన్‌లో నిలిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ 2026 పేపర్ 2 ఫలితాలు(పేపర్ 2ఏ, 2బి) మంగళవారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 7న నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 67,139 మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాలను jeemain.nta.nic.inలో చూసుకోవచ్చు. కేరళకు చెందిన ఆర్ఎస్ మీరాకృష్ణ, సూర్యతేజస్ బిఆర్క్ విభాగంలో మొదటి, రెండు స్థానాలు సాధించారు.
పేపర్ 2బి(బి. ప్లానింగ్)లో తెలంగాణకు చెందిన మద్దూరి నాగ ప్రద్యుమ్న రెడ్డి 6వ ర్యాంకు, పేపర్ 2ఏ (బి ఆర్క్)లో తెల్ల్లూరి శ్రేయస్ రెడ్డి 9వ ర్యాంకు సాధించారు. ఎస్టీ అభ్యర్థులలో బీ ఆర్క్ విభాగంలో తెలంగాణకు చెందిన శరణ్ చక్రవర్తి పృధ్విరాజ్ చౌహాన్, మాలోత్ సాయిచరణ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. బిప్లానింగ్లో ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులలో కౌశిక్ నాయక్ బోడా, పున్నూర్ రోహితారెడ్డి రెండు, మూడో స్థానాలను కైవసం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

