తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనుమడికి జన్మతః హక్కు లేదు
హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం తాత ఆస్తి ఆయన మొదటి తరగతి వారసులకు(మొదటి వరుస కుటుంబ సభ్యులు) సంక్రమించిన తర్వాత తండ్రికి కేటాయించిన ఆస్తిలో మనుమడికి జన్మహక్కు లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాతగారి ఆస్తి పంపకంలో తన తండ్రికి లభించిన భూమిని తర్వాత అమ్మేశారని పేర్కొంటూ, అందులో సగం వాటా కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ అగస్టిన్ ఆజర్జ్ మసిహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, నవంబర్ 11: హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం తాత ఆస్తి ఆయన మొదటి తరగతి వారసులకు(మొదటి వరుస కుటుంబ సభ్యులు) సంక్రమించిన తర్వాత తండ్రికి కేటాయించిన ఆస్తిలో మనుమడికి జన్మహక్కు లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాతగారి ఆస్తి పంపకంలో తన తండ్రికి లభించిన భూమిని తర్వాత అమ్మేశారని పేర్కొంటూ, అందులో సగం వాటా కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ అగస్టిన్ ఆజర్జ్ మసిహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తండ్రి తన వాటాకు వ్యక్తిగత హోదాలో ఏకైక యజమాని అయ్యాడని, ఆ ఆస్తి ఇకపై ఉమ్మడి హిందూ కుటుంబ లేదా సహభాగస్వామ్యంలో భాగం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భూమి అప్పీలుదారుని తాతకు చెందినది.
1993లో తాత కుమార్తె ఆస్తి పంపకం కోసం దావా వేసింది. 1994లో కుదిరిన రాజీ తీర్పు ప్రకారం వివాదాస్పద భూమి అప్పీలుదారుని తండ్రికి దక్కింది. అప్పీలుదారుడు 1994లో జన్మించాడు. 1997లో అతని తండ్రి ఆ భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించాడు. అప్పట్లో మైనర్‌గా ఉన్న అప్పీలుదారుడు తన తల్లి ద్వారా దావా వేస్తూ ఆస్తిలో సగం వాటాను విభజించి తనకు అప్పగించాలని కోరాడు. ఆ భూమి పూర్వీకుల ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, జన్మతః తనకు అందులో సహ-వారసునిగా హక్కు లభించిందని అతను వాదించాడు. చెన్నై సిటీ సివిల్ కోర్టు మొదట అతనికి అనుకూలంగా ప్రాథమిక డిక్రీని జారీ చేసింది. కొనుగోలుదారులు అప్పీలు చేయగా మొదటి అప్పీలు కోర్టు ఆ డిక్రీని రద్దు చేసింది. మద్రాసు హైకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ తన తండ్రికి కేటాయించిన ఆస్తిపై అప్పీలుదారునికి జన్మతః ఎటువంటి హక్కులేదని తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ(తమిళనాడు సవరణ) చట్టం, 1989లోని సెక్షన్ 29ఏపై ఆధారపడుతూ సుప్రీంకోర్టులో అప్పీలుదారుడు వాదించాడు. అయితే ఈ అప్పీలును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

