‘ఈ ఏడాది వృద్ధి 7 శాతం’
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధించనున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తున్నది. గతంలో 6.5శాతంగా ఉంటుందని అంచనావేసిన మూడీస్..ఇటీవలకాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వృద్ధి అంచనాను సవరించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధించనున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తున్నది. గతంలో 6.5శాతంగా ఉంటుందని అంచనావేసిన మూడీస్..ఇటీవలకాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వృద్ధి అంచనాను సవరించింది. మూడీస్ తన ‘గ్లోబల్ మ్యాక్రో ఔట్లుక్ 2027-28’లో ఈ వివరాలు వెల్లడించింది. అయితే ధరల ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతోపాటు మరింత విస్తరిస్తుండటంతో కుటుంబాల వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
అలాగే ద్రవ్యోల్బణం RBI నిర్దేశిత పరిమితి ఎగువస్థాయికి చేరువకానున్నదని అంచనావేసిన మూడీస్.. లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితులు చుట్టుముట్టడంతో వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపుతున్నాయని వివరించింది. ‘విస్తృత స్థాయిలో కొనసాగుతున్న భారత ఆర్థిక వేగం, ఇంధన సరఫరా సంక్షోభాన్ని తట్టుకున్న సామర్థ్యం కారణంగా 2026-27 వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నాం’ అని మూడీస్ తెలిపింది.
ఈ ఏడాది దేశ జీడీపీ 7 శాతానికి పైగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని రిజర్వుబ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ, ఎస్‌అండ్‌పీలు అంచనావేయగా..ఫిచ్ మాత్రం 6.9 శాతానికి సవరించింది. అయితే వడ్డీ రేట్లను మరింత పెంచే దిశగా ఉన్నందున కఠిన ద్రవ్య విధానం ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణను మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని పేర్కొం ది. ఇంధన ధరలు పెరగడం, ప్రపంచ వడ్డీ రేట్లు అధికంగా ఉండటం, వాణిజ్య, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కొనసాగడం వల్ల 2027లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మరింత క్లిష్టమైన బాహ్య పరిస్థితులను ఎదుర్కొంటాయని మూడీస్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

