8, 9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా..
అమెరికా అధ్యక్షుడిగా మూడో టర్మ్ తానే కొనసాగుతానంటూ డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష పదవిపై కాంక్షను మరోమారు బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పట్నుంచి 8-9 ఏండ్లు ఉంటానని, తానేమీ జోక్ చేయటం లేదని తాజాగా చెప్పారు.
- జోక్ చేయట్లేదు: అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, మే 5: అమెరికా అధ్యక్షుడిగా మూడో టర్మ్ తానే కొనసాగుతానంటూ డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష పదవిపై కాంక్షను మరోమారు బయటపెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పట్నుంచి 8-9 ఏండ్లు ఉంటానని, తానేమీ జోక్ చేయటం లేదని తాజాగా చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఏ వ్యక్తి కూడా అధ్యక్ష పదవికి రెండుసార్ల కంటే ఎక్కువసార్లు ఎన్నికవడానికి వీలు లేదు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈ మాటలు రావటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అధ్యక్షుడిగా ట్రంప్ రెండవ టర్మ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత మూడో పర్యాయం కూడా అధ్యక్ష పదవిలో తానే ఉంటానని 2025లో తన కోరికను బయటపెట్డారు. ఇందుకు రాజ్యాంగంలో కొన్ని మార్గాలు కూడా ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ సోమవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఒక బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఇప్పట్నుంచీ 8 – 9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా. బయటకు పోను. నేను జోక్ చేయటం లేదు. ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటా. అయితే, అసలు విషయం ఏమంటే.. మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రభుత్వ పాలనలో ఇది ప్రారంభ దశ మాత్రమే’ అని ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

