తిరువనంతపురం, మే 5: వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటిన్లు బుధవారం 24 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సెంటర్లు మూసివేస్తున్నామని కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ (కేహెచ్ఆర్ఏ) మంగళవారం తెలిపింది.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మే 6న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్పీజీ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల కార్యాలయాలు, కేంద్ర సంస్థల ముందు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపింది.