మున్సిపల్ జాగాలో దర్జాగా పాగా!
కోదాడ మున్సిపాల్టీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన యాదవనగర్‌లోని మున్సిపల్ స్థలంలో తెల్లవారే సరికి పెద్ద డబ్బా కొట్టు వెలిసింది. వార్డుకు చెందిన ఓ నాయకుడి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు వార్డుకు చెం దిన పలువురు ఆరోపిస్తున్నారు.
- తొలిగించాలని కమిషనర్, చైర్‌పర్సన్‌కు స్థానికుల ఫిర్యాదు
కోదాడ, మే 5 : కోదాడ మున్సిపాల్టీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన యాదవనగర్‌లోని మున్సిపల్ స్థలంలో తెల్లవారే సరికి పెద్ద డబ్బా కొట్టు వెలిసింది. వార్డుకు చెందిన ఓ నాయకుడి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు వార్డుకు చెం దిన పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కోదాడ ప్రధాన రహదారి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణకు, టెలికాం కార్యాలయం ప్రహరీని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కొం దరు ఇష్టారాజ్యంగా డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని కిరాయిలకు ఇస్తున్న విషయం అందరికీ విదితమే. పట్టణంలో ఎన్నో మున్సిపల్ స్థలాలను ఆక్రమించి దాదాపు 150 నుంచి 200 బడ్డీ కొట్లు ఏర్పాటు చేశారు.
దీంతోపాటు పలువురు చిరు వ్యాపారులు వీధులకిరువైపులా కాల్వలపై కూడా చిన్న బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో సదరు బడ్డీ కొట్లను తొలిగించే ప్రయత్నాలు జరిగాయి తప్పితే తొలిగించలేదు. తాజాగా 32వ వార్డులో మున్సిపాలిటీ వాహనాలు నిలిపే స్థలం లో ఓ భారీ డబ్బా కొట్టు వేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని వార్డు ప్రజలు విమర్శిస్తున్నారు. దానిని తొలిగించాలని కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

