IND Vs IRE | మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్లేయర్లందరికీ విశ్రాంతినివ్వడంతో యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం దక్కింది. ఇక గాయం కారణంగా నిరుడు టీ20 ప్రపంచకప్‌తో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్‌లకు దూరమైన భారత పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) దాదాపు ఏడాది తర్వాత ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఏడాది తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇస్తున్నా సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ ఫోటోను పంచుకుంది.
ప్రముఖ బ్రిటీష్ రచయిత జేఆర్ఆర్ టోల్కీన్ (JRR Tolkin) రాసిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్(The Lord Of the Rings) అనే నవల ఫేమస్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నవల ఆధారంగానే పీటర్ జాక్సన్ (Peter Jackson) ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (The Lord Of the Rings Movie Series) అనే చిత్రాలను తెరకెక్కించాడు. మూడు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టడమే కాకుండా.. టైటనిక్ మూవీ (11 ఆస్కార్లు గెలుచుకుంది) తర్వాత అత్యధికంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అయితే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రంలోని ఫ్రోడో బాగ్గిన్స్ (Frodo Baggins) అనే పాత్ర ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో బుమ్రా (Bumrah) ను పోల్చుతూ ది లార్డ్ ఆఫ్ ది స్వింగ్ ది రిటర్న్ ఆఫ్ ది కింగ్(The lord of The swing, the return of the king) అంటూ ఐసీసీ క్యాప్షన్ ఇచ్చి ఓ ఫోటోను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.
Coming soon 🎬 pic.twitter.com/El862zWHz3
— ICC (@ICC) August 18, 2023