Bumrah | దుబాయ్: భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ అవార్డుల పంట పండుతోంది. గత వారం రోజులుగా ఐసీసీ ప్రకటిస్తున్న పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ పేసుగుర్రం.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ – 2024’నూ గెలుచుకున్నాడు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరుమీద ఇచ్చే ఈ అవార్డును గెలిచిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
గతంలో భారత్ నుంచి ద్రవిడ్ (2004), సచిన్(2010), అశ్విన్ (2016), కోహ్లీ (2017, 2018) ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. కాగా ఈ అవార్డు కోసం హెడ్ (ఆస్ట్రేలియా), బ్రూక్, రూట్ (ఇంగ్లండ్) పోటీపడ్డా గతేడాది తన బౌలింగ్‌తో టెస్టులతో పాటు పరిమిత ఓవర్లలోనూ నిలకడగా రాణించిన బుమ్రానే ఈ అవార్డు వరించింది.అత్యుత్తమ క్రికెటర్‌తో పాటు బుమ్రాకు ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డూ, ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులోనూ చోటు దక్కింది.