జనగామ : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy ) నియోజక వర్గంలో బీఆర్ఎస్ ( BRS ) మద్దతుదారులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు. జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన బోళ్ల సంపత్ యాదవ్ గెలుపొందారు.
బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన పెరబోయిన కళ్యాణి పరుశరాములు ఘన విజయం సాధించారు. జనగామ మండలం ఎల్లం గ్రామ సర్పంచ్‌గా దేవునూరి సతీష్, పసరమడ్లలో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో భాస్కర్ రెడ్డి , బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌లో బీఆర్ఎస్ , దబ్బగుంటపల్లిలో చంద్రకళ , నాగిరెడ్డిపల్లిలో రవి గెలుపొందారు. జనగామ మండలం సిద్దెంకి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారుడు మడిపల్లి సుధాకర్ గౌడ్ గెలిచారు.