హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు, లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగా లు అంటూ ఊదరగొట్టి వివాహాలు చేసుకొని తీరా అక్కడికి వెళ్లిన తర్వాత భార్యల ను వేధింపులకు గురిచేస్తున్న ఎన్నారై భర్తలపై తెలంగాణ పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. మహిళా భద్రత విభాగంలోని ఎన్నాలై సెల్ ప్రత్యేకంగా పనిచేస్తున్నది. రెండేండ్లలో 212 కేసులు మోదు చేసి బా ధితులకు అండగా ఉంటున్నది. కేసుల న మోదుతోపాటు దర్యాప్తులో కేంద్ర హోం, విదేశాంగశాఖ, అన్ని దేశాల రాయబార కా ర్యాలయాలు, ఎన్జీవోలు, రీజినల్ పాస్పో ర్టు కార్యాలయాలను సమన్వయం చేస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నది.
విదేశాల్లో ఉండే ఎన్నారై భర్తలను ఇక్కడికి రప్పించి చట్టప్రకా రం శిక్షపడేలా చేస్తున్నది. ఇరుపక్షాలు రా జీపడే వీలుంటే వారి ఇష్టప్రకారం కౌన్సెలి ంగ్ కూడా ఇస్తున్నారు. రెండేండ్లలో 38 ఎన్నారై జంటలు రాజీ కుదుర్చుకుని మళ్లీ జీవితాలను కొనసాగిస్తున్నాయి. మొండి గా ఉండే ఎన్నారై భర్తలను సైతం ఉమెన్‌సేఫ్టీ వింగ్ అధికారులు చట్ట ప్రకారం ఇక్కడకు రప్పించడంలో సఫలీకృతం అవుతున్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ ఎనిమిది కేసులలో ఎన్ఆర్ఐల పాస్‌పోర్టులను సైతం రద్దయ్యాయి. చట్టప్రకారం శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తం దాఖలైన కేసులు 212
రాజీ కుదిరినవి 38
పెండింగ్ కేసులు 174
పెండింగ్ ట్రయల్‌లో ఉన్నవి 139
దర్యాప్తు కొనసాగుతున్నవి 35
లుక్ ఔట్ జారీ అయినవి 23
రద్దయిన ఎన్నారై పాస్‌పోర్టులు 08