రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని అన్నారు. యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టిన గిరిజన రైతు సాయి సిద్దు ఇంటికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్లో వెళ్లి జగదీశ్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట తండాలో యూరియా ధర్నాలో పాల్గొన్నందుకు సాయి సిద్దు అనే గిరిజన యువకుణ్ణి పోలీసులు ఇంతలా కొడతారా? ఇంత దారుణం ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యువకుణ్ని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని.. హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన అసలు దోషులు కాంగ్రెస్ నాయకులు. వాళ్లను కొట్టాలని అన్నారు.
సాయి సిద్దును కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్పీ పోలీసులను వెనకేసుకొని వస్తుండని.. జిల్లాలో ఎస్పీలు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా పని చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అమాయకులను కేసుల్లో ఇరికించి కొడుతున్నారని అన్నారు. యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని తెలిపారు. ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
ఈ జిల్లాలోనే యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాట జరిగి గాయపడి ఓ గిరిజన మహిళ చనిపోయిందని.. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని.. మిర్యాలగూడలో యూరియా లారీలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే యూరియా దందా చేస్తున్నారని విమర్శించారు. సాయి సిద్దు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి దిక్కెవరు? పని చేసుకోలేనంతగా బాగా కొట్టారని అన్నారు. ఆ పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా కోసం ధర్నా చేసినందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టిన సాయి సిద్దు ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ @mckotireddy, మాజీ ఎమ్మెల్యేలు @MlaRavindra, @BhupalReddyTRS, @BagathNomula.
ఈ సందర్భంగా @jagadishBRS కామెంట్స్ 👇🏻
🔸 రాష్ట్రంలో… pic.twitter.com/Q1g9ls1h32
— BRS Party (@BRSparty) September 24, 2025