బెంగళూరు: దులీప్ ట్రోపీ సెమీస్‌లో సౌత్ జోన్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ (197, 16 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నా లోయరార్డర్ ఆటగాళ్లు రికీ భుయ్ (54), తన్మయ్ త్యాగరాజన్ (58) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 536 పరుగుల భారీ స్కోరు చేసింది. నార్త్‌జోన్ బౌలర్లలో నిషాంత్‌కు (5/125) ఐదు వికెట్లు దక్కాయి.
వెస్ట్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో సెంట్రల్ బ్యాటర్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా సమాధానమిస్తున్నారు. వెస్ట్ జోన్‌ను 438 రన్స్‌కు ఆలౌట్ చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూ 229/2తో ఆటను ముగించింది. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ హీరో డానిష్ మాలేవర్ (76), శుభమ్ శర్మ (60) అర్ధ శతకాలతో రాణించగా అయుష్ పాండే (40), కెప్టెన్ రజత్ పాటిదార్ (47*) నిలకడగా ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.