సౌత్ జోన్ భారీ స్కోరు
దులీప్ ట్రోపీ సెమీస్‌లో సౌత్ జోన్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ (197, 16 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నా లోయరార్డర్ ఆటగాళ్లు రికీ భుయ్ (54), తన్మయ్ త్యాగరాజన్ (58) అర్ధ శతకాలతో రాణించారు.
- తృటిలో చేజారిన జగదీశన్ ద్విశతకం
బెంగళూరు: దులీప్ ట్రోపీ సెమీస్‌లో సౌత్ జోన్ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ (197, 16 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నా లోయరార్డర్ ఆటగాళ్లు రికీ భుయ్ (54), తన్మయ్ త్యాగరాజన్ (58) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 536 పరుగుల భారీ స్కోరు చేసింది. నార్త్‌జోన్ బౌలర్లలో నిషాంత్‌కు (5/125) ఐదు వికెట్లు దక్కాయి.
వెస్ట్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో సెంట్రల్ బ్యాటర్లు ప్రత్యర్థి జట్టుకు దీటుగా సమాధానమిస్తున్నారు. వెస్ట్ జోన్‌ను 438 రన్స్‌కు ఆలౌట్ చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూ 229/2తో ఆటను ముగించింది. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ హీరో డానిష్ మాలేవర్ (76), శుభమ్ శర్మ (60) అర్ధ శతకాలతో రాణించగా అయుష్ పాండే (40), కెప్టెన్ రజత్ పాటిదార్ (47*) నిలకడగా ఆడారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

