విశాఖపట్నం: (పీకేఎల్ 12వ సీజన్లో యూ ముంబా దుమ్మురేపింది. శుక్రవారం జరిగిన పోరులో యూ ముంబా 48-28 తేడాతో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. యూ ముంబా తరఫున అజిత్ చౌహాన్ 13 పాయింట్లు, సతీశ్ 6 పాయింట్లు, డిఫెండర్ రింకూ 5 పాయింట్లు, ఆల్‌రౌండర్ అనిల్ 4 పాయింట్లతో రాణించారు. మరో పోరులో డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ 37-32తో యూపీపై ఉత్కంఠ విజయం సాధించింది. రాహుల్ అహ్రి(6), రాహుల్(5), జైదీప్(3) రాణించారు.