Pawan kalyan | జనసేన పార్టీ సమావేశంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయి. నాకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయి. అక్కడి నటుడు కటౌట్లు పెట్టుకుంటే సీఎం అయిపోయారు. నేను ఈ స్థాయికి రావడానికి 12 ఏండ్లు పట్టింది. నేను పదే పదే కులం గురించి మాట్లాడతానని అంటారు. నేనెప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా..? మిగతా పార్టీల నేతలు కులం గురించి మాట్లాడటం లేదా..? అని అడిగారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలపై పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటి వాళ్లకు ఎలా తెలుస్తాయి..? ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలుఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. వైసీపీనాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను. ఒకరు జైలుకు వెళ్తేనే పవన్ కల్యాణ్ జనసేన ఎదుగుతుందా..? హోంమంత్రితో ఇలాంటి విషయాలే మాట్లాడతామా..? ఇది వ్యవస్థను అవమానపరచడమే. ఏపీ అభివృద్ధి కోసమే అమిత్‌షాను కలిశా. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. ఇప్పటివరకు అన్నీ భరించాను. ఇకపై భరించే ఓపిక నాకు లేదు. దారిన పోయే వాళ్ల్లంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోనని హెచ్చరించారు.
మాకు కోపాలు, బాధలు ఉంటాయి..చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఓహద్దు ఉంటుంది.. రెచ్చగొట్టడం సరికాదు. విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ ప్రాంతం కానీ వర్తించదు కానీ మనం తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు వాళ్ల కులం వాళ్ల ప్రాంతం వాళ్లుకు వర్తిస్తుంది. అమిత్‌షాను, పవన్ కల్యాణ్‌ను ఏమైనా అనేయొచ్చు. వాళ్లు మాత్రం ఏదైనా అంటే నేను మాత్రం నా ప్రాంతం నా కులం అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. శత్రువులు ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు. మనల్ని విమర్శించిన వాళ్లను విమర్శిస్తే కులం అడ్డొస్తుందా..? అని ప్రశ్నించారు. నేను కులాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక కులం మనిషిని కాదు. ఎవరినో అరెస్ట్ చేయించడానికి నేను రాజకీయం చేయడం లేదని స్పష్టం చేశారు.
డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంతకీ ఏమన్నారంటే..?
‘వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని తమ వాళ్ల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాతో చెప్పారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు.. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్.. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడికి ఆయన పట్ల శత్రుత్వం ఉండొచ్చు. కానీ మనకు ఎందుకు ఉండాలి.. మీకు కూడా మంచి చెబుతున్నాను. మీకు ఆ అవసరం ఏంటీ..? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మనకు ఉపయోగపడతాడు.. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా.. మీకు కూడాఆ వైఖరి మార్చుకోండి’ అని సలహా ఇచ్చారు అని అన్నారు.