ఆయన సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టం : మంత్రి సత్యవతి
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రజల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలు అణువణువున తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం కేసముద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ముఖాల్లో నిత్యం చిరునవ్వు ఉండాలని ఆశించి అనేక కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా తామంతా ఇక్కడి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.
అనేక మంది దాతల సహకారంతో శబరిమలలో ఉన్నట్లు 18 మెట్లతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన వారందరికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో మంత్రితో మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, బయ్యారం PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, పార్టీ నేతలు నూకల శ్రీ రంగారెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సీతా మహాలక్ష్మి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

