టీకాల వృథాను ఆపాలి : అధికారులతో ప్రధాని మోదీ
టీకాల వృథాను ఆపాలి : అధికారులతో ప్రధాని మోదీ |

న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో టీకాల వృథాను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన పది రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. సందర్భంగా కరోనా కట్టడి తీసుకుంటున్న చర్యలను, ప్రణాళికలను అధికారులు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఆరా తీశారు. భేటీలో ఛత్తీస్‌గఢ్, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, బెంగాల్ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ వందేళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా అన్నారు. కరోనా వైరస్ కారణంగా జిల్లా అధికారులు.. తమ విధులు నిర్వర్తించటం సవాల్‌గా మారిందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో మహమ్మారిపై పోరాడాలన్నారు. కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తి చెందుతోందన్నారు. వైరస్‌పై విధానాలు, వ్యూహాలు నిత్యం మార్చుకోవాలని చెప్పారు. మ్యుటెంట్ల నేపథ్యంలో యువత, చిన్నారులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా బారినపడిన యువత, చిన్నారుల వివరాలు సేకరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ వృథాపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. టీకా వృథాను ఆపడం అత్యంత ముఖ్యమన్నారు. ఒక్కో డోసు వృథా.. ఒక జీవితానికి రక్షణ కల్పించే అవకాశం వృథా అయినట్టేనన్నారు. వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని, పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులంతా పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరాపై స్పందిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ 15 రోజుల పాటు టీకాలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలకు అందిస్తుందని, వ్యాక్సినేషన్లో సహాయపడుతుందన్నారు.
ప్రజలు తమ జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉచిత రేషన్, ఇతర నిత్యావసర సామగ్రి అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రాణాలు కాపాడడడంతో పాటు ప్రతి వ్యక్తి జీవన సౌలభ్యం తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. పేదలకు ఉచిత రేషన్ సౌకర్యాలు ఉండాలని, నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించకుండా చూడాలన్నారు. ఇవన్నీ పోరాటంలో గెలిచేందుకు, ముందుకు సాగేందుకు అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

