బీమాతో ధీమా
రైతు బీమా రైతు కుటుంబాలకు కొండంత ధీమాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావ్‌పల్లిలో అర్సం నర్సయ్య భార్య పద్మకు, మరాటి లక్ష్మి భర్త మల్లేశానికి, దేశాయిపల్లిలో కొంకటి లక్ష్మణ్ భార్య లక్ష్మికి, నర్సింగాపూర్‌లో చావనపల్లి అంతయ్య కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీలను ఆయన అందజేశారు.
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- వెంకట్రావ్‌పల్లిలో బీమా ప్రొసీడింగ్ చెక్కుల అందజేత
బోయినపల్లి, జనవరి 12: రైతు బీమా రైతు కుటుంబాలకు కొండంత ధీమాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావ్‌పల్లిలో అర్సం నర్సయ్య భార్య పద్మకు, మరాటి లక్ష్మి భర్త మల్లేశానికి, దేశాయిపల్లిలో కొంకటి లక్ష్మణ్ భార్య లక్ష్మికి, నర్సింగాపూర్‌లో చావనపల్లి అంతయ్య కుటుంబాలకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం జీర్ణించుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పొద్దున లేస్తే చాలు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న నాయకులను తాము ఒక్కటే అడుగుతున్నామని, ఇలాంటి పథకాలు ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
ఇటీవల సెస్ ఎన్నికల్లో రైతులు కర్రుకాల్చి వాత పెట్టినా వారికి బుద్ధిరాలేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ పని తీరుకు సెస్ విజయమే నిదర్శనమని చెప్పారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే వెంట డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు బూర్గుల నందయ్య, ఒంటెల గోపాల్‌రెడ్డి, ఇల్లందుల శంకర్, చిందం రమేశ్, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, కన్నం మధు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

