బెంగళూరు, ఫిబ్రవరి 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించతలపెట్టిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ దాదాపు 25 గంటల పాటు కొనసాగనుంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి జరుగుతుంది. ఈ ఏడాదిలో ఇస్రో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం. పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్-04తో సహా మరికొన్ని చిన్న ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లనున్నది. ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు.